Site icon NTV Telugu

Speaker Tammineni Sitaram: చంద్రబాబు, పవన్ ఆరు నెలలు ఓపిక పట్టండి

Tammineni

Tammineni

స్వాతంత్య్ర అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ కు శంకుస్దాపన చేయడం సంతోషంగా ఉంది అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నేటి తరాలకు అమరవీరుల త్యాగాలు తెలియాలి.. ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉండేది ఇండియాలోనే.. ఈ భారతదేశంలో మన పాత్ర ఎంటో తెలుసుకోవాలి అని ఆయన అన్నారు. మహాత్మ గాంధీ చెప్పినట్లు పరిపాలనా గ్రామాల్లో అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని స్పీకర్ పేర్కొన్నారు.

Read Also: Talasani: దేశంలో ఇలాంటి ఇల్లు చూపించండి.. రాజీనామా చేస్తా..!

విద్యా రంగంలో అనేక రకాలైన సంస్కరణలు సీఎం జగన్ రాష్ట్రంలో తీసుకు వచ్చారని స్పకీర్ తమ్మినేని సీతారం అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక టార్చ్ బేరర్ లాంటి వ్యక్తి అని ఆయన తెలిపారు. జగన్ అడుగుజాడల్లో అందరూ నడవాలి.. అప్పుడే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఇక, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాదు ఎవరైనా ఈరోజు దీక్ష చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు.

Read Also: Jithender Reddy : జితేందర్ రెడ్డి గా బాహుబలి నటుడు.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్..

అయితే, దీక్ష చేసే ముందు ఎంత వరకు మన అర్హత ఉందో చూసుకోవాలి అని స్పీకర్ తమ్మనేని సీతారం అన్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర కాకపొతే హెలికాప్టర్ యాత్ర చేసుకోమనండి.. అది వాళ్ళ ఇష్టం.. తప్పు చేసి మోసం చేయాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఎన్నికలలో ప్రజలు ఊహించనంత తీర్పు ఇస్తారు.. ప్రజలు గొప్పవాళ్ళు.. పవన్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని స్ీకర్ తమ్మినేని సీతారం చెప్పుకొచ్చారు.

Exit mobile version