Jithender Reddy : జితేందర్ రెడ్డి గా బాహుబలి నటుడు.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు విరించి వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాల తో డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విరించి వర్మ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జితేందర్ రెడ్డి. మంచి లవ్ ట్రాక్ స్టోరీలతో అందరినీ ఆకట్టుకున్న విరించి వర్మ ఏడేళ్ల గ్యాప్ తర్వాత యూటర్న్ తీసుకొని పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే ఈ సినిమా లో ఎవరు హీరోగా నటిస్తున్నారనేది సస్పెన్స్ లో పెడుతూ రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. బాహుబలి, ఎవరికీ చెప్పొద్దూ,మిర్చి వంటి సినిమాల్లో అద్భుతం గా నటించి మెప్పించిన రాకేశ్ వర్రె ఈ సినిమా లో హీరో గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ముందుగా వచ్చిన ఆ వార్తలే నిజమయ్యాయి. జితేందర్ రెడ్డి పాత్ర లుక్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రాకేశ్ వర్రె తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంట్ లో చేతిలో తుపాకీ పట్టుకుని సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. జితేందర్ రెడ్డి ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలు పెంచుతోంది. హీరోగా రాకేష్ వర్రె సక్సెస్ అందుకోవడం ఖాయం అని తాజా లుక్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది.. ఈ చిత్రాన్ని ముడుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై రవిందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా ఉమ రవీందర్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వాణిశ్రీ పొడుగు వ్యవహారిస్తున్నారు. అలాగే వీఎస్ జ్ఞానశేఖర్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.తన ట్యూన్స్ తో యూత్ ని ఎంతగానో ఆకట్టుకునే గోపీసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.మరి ఈ సినిమాతో రాకేష్ వర్రె ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి..
Also Read
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!