Site icon NTV Telugu

Tammineni Seetaram: ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. భావోద్వేగానికి లోనైన స్పీకర్

Seetharam

Seetharam

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా.. మూడురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కాగా.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ త‌మ్మినేని సీతారాం భావోద్వేగానికి లోనయ్యారు. శాస‌న‌స‌భ‌ స్పీక‌ర్గా శ్రీకాకుళం నుండి నాల్గవ వ్యక్తిగా ప‌ని చేసే అదృష్టం ద‌క్కిందని తెలిపారు. సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవ‌హ‌రించానని అన్నారు. ప్రతిప‌క్ష స‌భ్యుల‌కు స‌మాన అవ‌కాశాలు క‌ల్పించానని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల‌కు స‌మ‌యం ఇచ్చాను.. స‌భ‌లో జ‌వాబుదారీగా వ్యవ‌హ‌రించానని స్పీకర్ తెలిపారు.

Read Also: Adudam Andhra: ఈనెల 13న విశాఖకు సీఎం జగన్.. ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలకు హాజరు

తాను స‌భాప‌తిగా ఉన్న స‌మ‌యంలో అనేక కీల‌క బిల్లులు ఆమోదం పొందాయని స్పీకర్ తమ్మినేని చెప్పారు. విప‌క్ష స‌భ్యుల అనుచిత ప్రవ‌ర్తన‌రకు బాధితునిగా మారానన్నారు. ప్రతిప‌క్ష స‌భ్యులు విమ‌ర్శలను ఓపిక‌గా భరించానని తెలిపారు. విప‌క్ష స‌భ్యుల ప్రవ‌ర్తన తనను భాదించాయి, బాధితునిగా చేశాయని పేర్కొన్నారు. తన విధులు నిర్వర్తించ‌డంలో ప్రతిపక్ష సభ్యులు తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. విప‌క్షాలు త‌మ ప్రవ‌ర్తన‌తో శాస‌న‌స‌భ స్ధాయిని త‌గ్గించారని.. స‌భ గౌర‌వ మ‌ర్యాద‌లు కాపాడేలా ప్రతి ఒక్కరూ ప్రవ‌ర్తించాలని ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం తెలిపారు.

Read Also: Delhi: పార్లమెంట్ ముట్టడికి రైతుల పిలుపు.. బోర్డర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

Exit mobile version