NTV Telugu Site icon

Spain wildfires: స్పెయిన్‌ అడవుల్లో కార్చిచ్చు.. బుగ్గిపాలైన 3 వేల భవనాలు

Spain Wildfires

Spain Wildfires

స్పెయిన్‌ దేశంలోని కెనరీ దీవుల్లోని అడవుల్లో మంటలు కలకలం కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా వ్యాపించడంతో.. సమీపంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నిన్నటి (శనివారం) వరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్చిచ్చు దాదాపు 11 వేల ఎకరాల విస్తీర్ణం వరకు ఈ మంటలు వ్యాపించాయని, పరిస్థితి మరింత దిగజారుతుందని స్పెయిన్ అధికారులు చెబుతున్నారు.

Read Also: Amjed Ullah Khan : ‘రజాకార్‌’ సినిమాపై నిషేధం విధించాలి

అయితే, అధికారులు ఈ మంటలను ఆర్పేందుకు 10 హెలికాఫ్టర్‌ల సహాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. మంటలను అదుపు చేయడం మాత్రం అంతంతగానే ఉన్నట్లు పేర్కొన్నారు. కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన ఈ కార్చిచ్చు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలు కావడం వల్లే ఈ కార్చిచ్చుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. దీని వలన ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.. అయితే చాలా అరటి తోటలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలతో పాటు దాదాపు 3 బిల్డింగ్ లు ఆగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Gadikota Srikanth Reddy: పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే సీఐ అంజూయాదవ్‌కు క్షమాపణలు చెప్పాలి

అటవిలో చెలరేగుతున్న మంటల కారణంగా ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు కానరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో చెప్పుకొచ్చారు. కొందరు ప్రజలు తమ ఇళ్లను వీడేందుకు ఒప్పుకోకపోవడంతో.. వారు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎండ వేడిమిలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, అయితే తమ వంతు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు వెల్లడించాడు.