Police Act: తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ

  • తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ సుబ్బారాయుడు
  • నిబంధనను అతిక్రమించి ఎవరైనా ర్యాలీలు చేపడితే చట్టా ప్రకారం కఠిన చర్యలు
Police Act

Police Act

తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. జిల్లా పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు ఎస్పీ సుబ్బారాయుడు. నిబంధనను అతిక్రమించి ఎవరైనా ర్యాలీలు చేపడితే చట్టా ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.