NTV Telugu Site icon

SP Anburajan : అనూష ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే

Sp Anburajan

Sp Anburajan

వైఎస్సార్ జిల్లాలోనీ బద్వేల్ లో సంచలనం రేపిన అనూష అనే విద్యార్ధి మిస్సింగ్, అనుమానాస్పద మృతి కేసు పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారమే అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్దారణఅయినట్లు పోలీసులు తెలిపారు. మహేష్ అనే వ్యక్తి ప్రేమ వేధింపులు ఇతర కారణాలతో నీటిలో మునిగి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్పీఅన్బురాజన్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బద్వేల్ లో అనూష మిస్సింగ్‌ కేసును అనూష తండ్రి బద్వేల్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, దీనిపై ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టామన్నారు.
Also Read : WhatsApp down: నిలిచిపోయిన వాట్సాప్‌ సేవలు…

సిద్దవటం, నెల్లూరు, బద్వేల్ లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపామని, సిద్దవటం వద్ద పెన్నా నది ఒడ్డున 23వ తేదీ అనూష శవం లభ్యమైందన్నారు. సంఘటన స్థలంలో దొరికిన అనూష మృతదేహానికి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి, బాడీ లో ఎక్కడా లోపల, బయట ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు ఎస్పీ అన్బురాజన్.