NTV Telugu Site icon

SoyaBean Pest Control : సోయాబీన్ పంటను ఆశించే తెగుళ్లను నివారించే పద్ధతులు..

Early Soybean

Early Soybean

మన దేశంలో ఎక్కువగా పండించే కూరగాయల పంటలలో సోయా కూడా ఒకటి.. మార్కెట్ లో వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు..వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. వీటిలో పోషకాలు ఎక్కువే.. ఈ పంటకు తెగుళ్ల బెడద కూడా ఎక్కువే.. రైతులకు పెద్ద తల నొప్పిగా మారింది.. అయితే ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి అరికడితే మంచి దిగుబడి పొందవచ్చు. ఈ తెగులు ఒక ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఫంగస్ పంట మొక్కల అవశేషాలలో, భూమిలో ఎన్నో సంవత్సరాల పాటు జీవించే ఉంటుంది.

ఈ తెగుళ్లు మొక్కల ఆకుల కణజాలాన్ని ఆక్రమించి నివాసాలను ఏర్పరచుకొని మొత్తం వ్యాపిస్తాయి… ఇక మెల్లగా అవి కాయల లోపలకు చేరుతాయి.. వాటివల్ల పంట నాణ్యత తగ్గిపోవడంతో మార్కెట్ లో డిమాండ్ కూడా తగ్గుతుంది.. ఇక ఈ మధ్య మార్కెట్ లో నకిలీ విత్తనాలు ఎక్కువగా వస్తున్నాయి.. వాటివల్ల కూడా తెగుళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. సర్టిఫైడ్ కంపెనీలకు పొందిన తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి. గతంలో వేసిన పంటలో ఈ కుళ్ళు తెగులు ఉన్నట్లయితే పంటను మార్చి వేరే పంటను సాగు చేయాలి.

ఇకపోతే మొక్కలను కిందకు వాలకుండా పడిపోకుండా కర్రల సాయంతో వాటిని నిలబెట్టాలి.. ఇతర పంట అవశేషాలను, కలుపు మొక్కలను కనిపించిన వెంటనే తీసేయాలి. ముఖ్యంగా మొక్కలు ఎదిగే చివరి దశలో అధికంగా ఎరువులు వాడకూడదు..ఇతర పంట అవశేషాలను, కలుపు మొక్కలను కనిపించిన వెంటనే తీసేయాలి. ముఖ్యంగా మొక్కలు ఎదిగే చివరి దశలో అధికంగా ఎరువులు వాడకూడదు..మొక్కలపై నీటితో తడిచినట్టు ఉండే ఉబ్బిన మచ్చలు కనిపిస్తే ఈ తెగులు సోకినట్లు నిర్ధారించుకోవాలి. ఈ తెగుల లక్షణాలు కాండం, ఆకులు, కాయలపై గమనించవచ్చు. ఈ తెగులను సేంద్రీయ పద్ధతిలో నివారించాలంటే ఫంగల్ పరాన్నజీవి కొయోథైరియం మినిటాన్స్ అతుల మొక్కల యొక్క రేనుగుల సూత్రీకరణలు ఈ తెగులను నివారించడానికి సహాయపడతాయి.. కాపర్ ఆధారిత శిలీంద్రా నాశినినులను మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే తెగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.. ఇక తెగుళ్ల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది..