NTV Telugu Site icon

Government Offer: గోల్డెన్‌ ఆఫర్‌.. తక్కువ ధరకే పసిడి మీ సొంతం..!

Sbgs

Sbgs

Government Offer: బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ.. మన సంప్రదాయాల్లో పసిడికి ప్రత్యేక స్థానం ఉంటుంది.. ఇంట్లో జరిగే చిన్న శుభకార్యం నుంచి జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లి.. ఆ తర్వాత జరిగే.. ప్రతీ ఫంక్షన్‌లోనూ.. వారివారి స్థాయిలను బట్టి బంగారం ఉండాల్సిందే.. అందుకే.. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా..? గోల్డ్‌కు ఎంత డిమాండ్‌ ఉన్నా.. కొనుగోలు చేసేవారు ఎప్పుడూ ఉంటారు.. అయితే, ఇప్పుడు తక్కువ ధరకే గోల్డ్‌ సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.. ఇక, గోల్డ్‌ కొనేవారు ఓవైపు.. మరోవైపు గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారు మరోవైపు భారీ సంఖ్యలోనే ఉంటారు.. ఇప్పుడు సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2023-24 తొలి విడత సబ్‌స్క్రిప్షన్‌.. ఈ రోజు ప్రారంభమైంది. మార్కెట్‌ ధర కంటే తక్కువకే గోల్డ్ పొందవచ్చు.. అంటే గోల్డ్‌ మీ చేతికి రాదు.. కానీ, ఈ స్కీమ్‌ కింద గోల్డ్‌ బాండ్‌ పొందుతారు.

Read Also: Jagadish Shettar: కర్ణాటక ఎమ్మెల్సీ ఉపఎన్నికల బరిలో జగదీష్ షెట్టర్

ఇక, సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2023-24లో ఒక్కో గ్రాముకు రూ.5,926 చొప్పున ఇష్యూ ధరను నిర్ణయించారు. జూన్‌ 19వ తేదీ నుంచి.. అంటే ఈ రోజు నుంచి జూన్‌ 27వ తేదీ వరకు ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.. ఈ బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. వీటిని బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో విక్రయిస్తారు. ఇక.. అంతా డిజిటల్‌ మయం అయిన తరుణంలో.. ఆన్‌లైన్‌లో ఈ బాండ్లను కొనుగోలు చేసేవారు గ్రాము బంగారంపై అదనంగా రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. అంటే.. ఆన్‌లైన్‌ మోడ్‌లో పేమెంట్‌ చేసేవారికి గ్రాము బంగారం రూ.5,876కే లభిస్తుందన్నమాట.

Read Also: Swamyji Sampoornananda: విశాఖలో బయటపడ్డ కీచక స్వామీజీ లీలలు.. బాలికపై లైంగిక దాడి

కాగా, పెరిగిపోతున్న బంగారం కొనుగోళ్లకు చెక్‌పెట్టాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం.. ఈ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన గోల్డ్‌కు ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన ధర ఆధారంగా గ్రాము రేటును నిర్ణయిస్తారు.. ఇక, ఈ స్కీమ్‌లో కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సి ఉండగా.. గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఇక, ట్రస్టులైతే ఏకంగా 20 కేజీల బంగారం వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.. ఈ బాండ్‌ కాలపరిమితి 8 ఏళ్లుగా ఉంటుంది.. గడువు ముగిసినప్పుడు అప్పటి ధరను పొందవచ్చన్నమాట.. 8 ఏళ్ల వరకు మేం ఆగలేం అంటే మాత్రం.. ఐదేళ్ల తర్వాత కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏటంటే.. మీ బాండ్‌పై వడ్డీని కూడా చెల్లిస్తోంది ప్రభుత్వం.. ఈసారి వార్షిక వడ్డీ రేటును 2.5 శాతంగా నిర్ణయించారు. అంటే.. కాలపరిమితి ముగిసినప్పుడు ఉన్న బంగారం ధరతో పాటు.. అప్పటి వరకు 2.5 శాతం వడ్డీ కూడా పొందవచ్చు. వరుసగా బంగారం ధరలు పైపైకి కదులుతోన్న తరుణంలో.. దానిపై పెట్టుబడి పెట్టేవారికి ఇది ఎంతో మేలైన స్కీమ్‌గా చెబుతున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.