Site icon NTV Telugu

Weather Report: మత్స్యకారులు అప్రమత్తంగా ఉండండి.. ఐఎండీ హెచ్చరిక..!

Weather Report

Weather Report

Weather Report: ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇవి కశ్మీర్, సిమ్లా మీదుగా హిమాలయాల వరకు విస్తరిస్తుండగా, మరో రెండు మూడు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్నాయని భారత వాతావరణశాఖ (IMD), విశాఖపట్నం తెలిపింది. ఈ సారి రుతుపవనాల వ్యాప్తి మాములు కంటే సుమారు 15 రోజులు ముందుగానే వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో, 5.8 నుండి 7.6 కిలోమీటర్ల పైన ఆవరించడంతో.. దీనివల్ల రాబోయే రెండు రోజులు వర్షాల సూచన ఉండనుంది.

Read Also: Minister Narayana: భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు.. 12 అంశాలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం..!

ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్న నేపథ్యంలో, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికార అధికారులు హెచ్చరించారు. రుతుపవనాల ఈ చురుకైన ప్రవాహంతో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఏర్పడనుంది.

Read Also: Rohit Sharma: ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయా.. కుంబ్లేను కవర్ చేశా!

Exit mobile version