Traffic ACP: హ్యాట్సాఫ్ మేడం.. డ్రైనేజీ చెత్తను చేతితో తీసిన మహిళా పోలీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South West Traffic ACP Dhanlakshmi Clears Drainage With Hands: మనకి కష్టం వస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. 24/7 వారు మనకి అందుబాటులో ఉంటారు.అయితే కొంతమంది పోలీసులు చేసే పనులు డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు తెస్తుంటే కొంతమంది చేసే పనులు మాత్రం పోలీసు శాఖ గొప్పదనాన్ని అందరికి తెలిసేలా చేస్తారు. అటువంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ పోలీసు అధికారి తన చేత్తో డ్రైనేజీపై పేరుకుపోయిన చెత్తను తీసి ప్రయాణీకులకు అడ్డంకి లేకుండా చేశారు.
Also Read: LED Light Dress: మూములు క్రియేటివిటీ కాదుగా.. వధువు డ్రెస్ చూసి అందరూ షాక్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గత రెండు, మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్ల మీదకు నీరు చేరుతుంది. వరద నీటితో పాటు చెత్త కూడా కొట్టుకు వస్తుంది. ఇది పలు డ్రైనేజీల వద్ద నిలిచిపోతుంది. కారణంగా నీరు లోపలి వెళ్లకుండా రోడ్ల మీదే భారీగా నిలిచిపోతుంది. దీంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాగే నగరంలోని టోలీచౌక్ ఫ్లై ఓవర్ వద్ద కూడా చెత్త పేరుకుపోయింది. ఈ కారణంగా ఓ డ్రైనేజీ పై భాగం మూసిపోయింది. అయితే ప్రజలకు దీని వల్ల ఇబ్బంది కలగకూడదని ఏకంగా ట్రాఫిక్ సౌత్ వెస్ట్ జోన్ ఏసీపీనే నడుం బిగించారు. డ్రైనేజీ పై భాగం వద్ద చెత్తను చేతితో తొలగించారు. ఆమెతో పాటు మరో పోలీసు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. దీంతో ఈ వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేశారు. టోలిచౌక్ వద్ద మూసుకుపోయిన డ్రైనేజీ పై భాగాన్ని ఏసీపీ ట్రాఫిక్ సౌత్ వెస్ట్ జోన్ డి. ధనలక్ష్మి చేతితో శుభ్రం చేశారు అంటూ తెలుపుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ధనలక్ష్మి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందరు పోలీసులు ఇలానే ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు.
#HYDTPinfo
Smt. D. Dhana Laxmi, ACP Tr South West Zone, cleared the water logging by removing the clog at drain water near Tolichowki flyover.@AddlCPTrfHyd pic.twitter.com/lXDLix6dMp— Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!