Site icon NTV Telugu

Traffic ACP: హ్యాట్సాఫ్ మేడం.. డ్రైనేజీ చెత్తను చేతితో తీసిన మహిళా పోలీస్

Police

Police

South West Traffic ACP Dhanlakshmi Clears Drainage With Hands: మనకి కష్టం వస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. 24/7 వారు మనకి అందుబాటులో ఉంటారు.అయితే కొంతమంది పోలీసులు చేసే పనులు డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు తెస్తుంటే కొంతమంది చేసే పనులు మాత్రం పోలీసు శాఖ గొప్పదనాన్ని అందరికి తెలిసేలా చేస్తారు. అటువంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ పోలీసు అధికారి తన చేత్తో డ్రైనేజీపై పేరుకుపోయిన చెత్తను తీసి ప్రయాణీకులకు అడ్డంకి లేకుండా చేశారు.

Also Read: LED Light Dress: మూములు క్రియేటివిటీ కాదుగా.. వధువు డ్రెస్ చూసి అందరూ షాక్

వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గత రెండు, మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్ల మీదకు నీరు చేరుతుంది. వరద నీటితో పాటు చెత్త కూడా కొట్టుకు వస్తుంది. ఇది పలు డ్రైనేజీల వద్ద నిలిచిపోతుంది. కారణంగా నీరు లోపలి వెళ్లకుండా రోడ్ల మీదే భారీగా నిలిచిపోతుంది. దీంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాగే నగరంలోని టోలీచౌక్ ఫ్లై ఓవర్ వద్ద కూడా చెత్త పేరుకుపోయింది. ఈ కారణంగా ఓ డ్రైనేజీ పై భాగం మూసిపోయింది. అయితే ప్రజలకు దీని వల్ల ఇబ్బంది కలగకూడదని ఏకంగా  ట్రాఫిక్ సౌత్ వెస్ట్ జోన్ ఏసీపీనే నడుం బిగించారు.  డ్రైనేజీ పై భాగం వద్ద చెత్తను చేతితో తొలగించారు. ఆమెతో పాటు మరో పోలీసు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. దీంతో ఈ వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేశారు. టోలిచౌక్ వద్ద మూసుకుపోయిన డ్రైనేజీ పై భాగాన్ని ఏసీపీ ట్రాఫిక్ సౌత్ వెస్ట్ జోన్ డి. ధనలక్ష్మి చేతితో శుభ్రం చేశారు అంటూ తెలుపుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ధనలక్ష్మి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందరు పోలీసులు ఇలానే ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు.

 

Exit mobile version