NTV Telugu Site icon

Good News: అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు..

Rain

Rain

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఓ కీలక అప్డేట్ ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపనాలు మొదటగా తాకుతాయి. ప్రతియేటా మే 18 – 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం అవుతుంది.

PM Modi: అవినీతికి అమ్మ కాంగ్రెస్… అభివృద్ధిని పట్టించుకోని జేఎంఎంపై మోడీ విమర్శలు

ఈ రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయి. ప్రీ మాన్ సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు. దక్షిణ చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమల మీదుగా సగటు సముద్ర మట్టం నకు 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆగ్నేయ / నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

Yadadri Dress Code: యాదాద్రి భక్తులకు డ్రెస్‌ కోడ్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..

దాంతో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా కలదు.