Site icon NTV Telugu

Tamilisai: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలంగాణ మాజీ గవర్నర్..

Tamilsai

Tamilsai

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందర రాజన్ తిరిగి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో జాయిన్ అయ్యారు. దీంతో ఆమెకు దక్షిణ చెన్నై నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కింది. అయితే, తమిళనాడులో మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా.. తమిళిసై తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ఎక్కటుతంగల్ నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

Read Also: Mukhtar Ansari: 20ఏళ్ల తర్వాత అడిగినా ముక్తార్ జుట్టు, గోర్లు విచారణకు ఇస్తాం: అఫ్జల్ అన్సారీ

ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు నాకు ఓటేస్తారని భరోసా ఇస్తున్నారు తెలిపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్ట లేదు అని చెప్పుకొచ్చింది. కేవలం మాటల పైనే దృష్టి సారించారు అని విమర్శలు గుప్పించింది. వర్షాలు కురిస్తే నగరానికి వరదలు వచ్చాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి నిర్మాణాలు చేస్తాం.. చెన్నైని నీటి ఎద్దడి, వరదలు లేకుండా చేయడమే మా మొదటి లక్ష్యం అని ఆమె తెలిపింది. కాగా గతంలో డాక్టర్ అయిన తమిళిసై.. తెలంగాణ గవర్నర్ గా కీలక పదవిలో కొనసాగారు. ఇక, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా ఎండలో తిరగడం చేత ఆమె ప్రస్తుతం నల్లగా మారిపోయింది.

Exit mobile version