NTV Telugu Site icon

South Central Railways : ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన దక్షిణ మధ్య రైల్వే..

Railway Station Rush

Railway Station Rush

South Central Railways : సంక్రాంతి పండుగ సీజన్ దృష్ట్యా ప్రయాణీకుల అదనపు రద్దీని నియంత్రించడానికి దక్షిణ మధ్య రైల్వేచేపట్టిన చర్యలు చేపట్టింది. సంక్రాంతి పండుగ సీజన్ దృష్ట్యా స్టేషన్లు , రైళ్లలో ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది దక్షిణ మధ్య రైల్వే.. దక్షిణ మధ్య రైల్వే పండుగ సీజన్ల దృష్ట్యా అదనపు ప్రయాణ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైలు వినియోగదారుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి వివిధ గమ్యస్థానాల మధ్య జనవరి నెలలో 366 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లలో ఎక్కువ భాగం పీక్ హాలిడే సీజన్‌లో నడపబడుతున్నాయి.. ఈ రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా ఇతర ప్రసిద్ధ గమ్యస్థానాలకు కూడా నడపబడతాయి. ఈ రైలు సర్వీసులలో ఇందులో రిజర్వ్‌డ్ కోచ్‌లు , అన్‌రిజర్వ్‌డ్ వివిధ కోచ్ ల మిశ్రమ కూర్పుతో అన్ని విభాగాల ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.

Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

నర్సాపూర్ , కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం , మచిలీపట్నం , తిరుపతి , బెర్హంపూర్, జైపూర్, గోరఖ్‌పూర్, కటక్, మదురై, అర్సికెరె మొదలైన ప్రసిద్ధ గమ్యస్థానాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి. మరికొన్ని ప్రత్యేక రైళ్లు నెల్లూరు, విజయవాడ రాజమండ్రి, వరంగల్ కు నడుపబడుతున్నాయి. ఇతర జోన్ ల ప్రదేశాలైన షాలిమార్, సంబల్‌పూర్ , బరౌని , విశాఖపట్నం మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి నర్సాపూర్ , కాకినాడ, శ్రీకాకుళం స్టేషన్ల వైపు 59 ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి. ఇందులో 16 జనసాధరణ రైళ్లు చర్లపల్లి నుండి విశాఖపట్నం , తిరిగి చర్లపల్లి వరకు సాధారణ కోచ్‌లతో ప్రత్యేకంగా నడపబడుతున్నాయి .

పండుగ సీజన్లో చేపట్టిన ప్రత్యేక చర్యలు
టిక్కెట్ల పంపిణీని బలోపేతం చేయడానికి, 5 ప్రధాన స్టేషన్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయబడినాయి.. అదనంగా, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అన్ని ప్రధాన స్టేషన్లలో ఎ.టి.వి.ఎం.ఫెసిలిటేటర్లను అందుబాటులోకి తీసుకొనిరవాడమైనది. స్టేషన్లలో రద్దీని నిరంతరం పర్యవేక్షించడం కోసం డివిజనల్ కమర్షియల్ కంట్రోల్లో మానిటరింగ్ సెల్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే రైళ్ల బయలుదేరే సమయాల్లో / రైళ్ల నడిచే సమయాల్లో రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన స్టేషన్లలో అధికారులను నియమించడం జరిగింది.

జనరల్ కోచ్‌లలోకి ప్రయాణికుల సజావుగా ప్రవేశించడాన్ని నియంత్రించడానికి , రిజర్వ్ చేయబడిన కోచ్‌లలోకి అనధికార ప్రయాణికుల ప్రవేశాన్ని నియంత్రించడానికి, అధిక రద్దీ ఉండే రైళ్ల దగ్గర సెక్షన్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్లు/టిక్కెట్ చెకింగ్ సిబ్బంది ఆర్.పి.ఎఫ్ సిబ్బందితో సమన్వయంతో అందుబాటులో ఉంటారు. స్టేషన్లలో ఇతర డిస్ప్లే బోర్డులతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తరచుగా ప్రకటనలు చేయబడుతున్నాయి. .

నడపబడుతున్న ప్రత్యేక రైళ్ల గురించి ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేసేందుకు , సంబంధిత గమ్యస్థానాలకు అందుబాటులో ఉన్న రైళ్లకు సంబంధించి ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రధాన స్టేషన్లలో ఎంక్వైరీ కమ్ ఫెసిలిటేషన్ కౌంటర్లు నిర్వహించబడుతున్నాయి. రైళ్ల ప్లాట్‌ఫారమ్ కేటాయింపుకు సంబంధించి ఆపరేటింగ్ విభాగంతో , జనసమూహ నిర్వహణ కోసం భద్రతా విభాగంతో సన్నిహిత సమన్వయం నిర్వహించబడుతోంది.

Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..

Show comments