Site icon NTV Telugu

36 Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. 36 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Train

Train

36 Trains Cancelled: రైల్వే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఏకంగా 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటిచింది.. ఈ నెల అంటే జూన్ 26 తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది..

Read Also: Andhra Pradesh: విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు.. ఈటీఎస్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం

ఈ నెల 26 నుంచి జులై 2వ తేదీ వరకు రద్దు చేయబడిన రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. 07753 కాజీపేట్‌-డోర్నకల్‌, 07754 డోర్నకల్‌-కాజీపేట్‌, 07755 డోర్నకల్‌-విజయవాడ, 07756 విజయవాడ-డోర్నకల్‌, 07278 భద్రాచలం-విజయవాడ, 07979 విజయవాడ-భద్రాచలం, 07591 సికింద్రాబాద్‌-వికారాబాద్‌, 07592 వికారాబాద్‌-కాచిగూడ, 07462 సికింద్రాబాద్-వరంగల్, 07463 వరంగల్‌ -హైదరాబాద్‌, 07766 సిర్పూర్‌ టౌన్‌ – కరీంనగర్‌ సహా.. మొత్తం 36 రైళ్లను రద్దు చేసింది దక్షణ మధ్య రైల్వే.. కింది టేబుల్‌లో రైల్‌ నంబర్‌, గమ్యస్థానం, తేదీలను చూసుకోవచ్చు..

 

Exit mobile version