NTV Telugu Site icon

Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు, రేపు మరో 20 రైళ్ళు రద్దు..

Trains Cancelled

Trains Cancelled

Trains Cancelled: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తూ వస్తుంది.. కొన్ని రైళ్లను రద్దు చేస్తే.. మరికొన్ని సర్వీసులను దారి మళ్లిస్తుంది.. ఇంకా కొన్ని రైళ్లను తాతాల్కికంగా రద్దు చేసింది.. అయితే, తెలుగు రాష్ట్రంలో ఇవ్వాళ, రేపు నడపవలసిన మరో 20 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో 544 ట్రైన్ లను భారీ వర్షాల కారణంగా రద్దు అయినట్లు సమాచారం. తాజాగా మరో 20 రైళ్ళను రైల్వే అధికారులు దారి మళ్లించినట్లు తెలిపారు.
Read also: Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా..

దీంతో ఇప్పటివరకు 187 రైళ్ళను పైగా దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించినట్లు వెల్లడించారు. తాత్కాలికంగా మూడు రోజుల్లో 20కి పైగా రైళ్ళను రద్దు చేసినట్లు ప్రకటించారు. నిన్నటి వరకు తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్లలో ఉన్న దాదాపుగా 10 వేలమంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు. తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ అధికారుల సమన్వయంతో 158 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాజీపేట నుండి దానాపూర్, బెంగళూరు.. విజయవాడ నుండి చెన్నై, విశాఖపట్నం వరకు ప్రయాణికులు రవాణా చేయడానికి ఐదు ప్రత్యేక రైళ్లను నడిపారు.

D. Sridhar Babu: కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..