Sri lanka: దక్షిణాసియాలో మొదటి డిస్నీల్యాండ్‌ను హంబన్‌టోటాలో ఏర్పాటు చేయడంపై చర్చలు జరపడానికి డిస్నీల్యాండ్ బృందం నవంబర్‌లో శ్రీలంకను సందర్శించేందుకు అంగీకరించింది. శ్రీలంకలో డిస్నీల్యాండ్‌ను ప్రారంభించేందుకు డిస్నీల్యాండ్ అధికారులు తనతో చర్చలు జరుపుతున్నట్లు ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి డయానా గమేజ్ గతంలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ శ్రీలంక పర్యాటక రంగానికి ఊతమిస్తుందని ఆమె అన్నారు. దక్షిణాసియాలో మొదటి డిస్నీల్యాండ్‌ను హంబన్‌టోటాలో ఏర్పాటు చేసేందుకు గాను నవంబర్‌లో శ్రీలంకను సందర్శించడానికి అంగీకరించిందని డైలీ మిర్రర్ అసోసియేట్ ఎడిటర్ జమీలా హుసియన్ ట్వీట్ చేశారు. “వాల్ట్ డిస్నీ నుండి ఆహ్వానం మేరకు 18 బిలియన్ డాలర్ల పెట్టుబడి కోసం ప్రణాళికలను చర్చించడానికి డయానా గమేజ్ త్వరలో యూఎస్ సందర్శిస్తారు” అని హుసియన్ తెలిపారు.
PM Modi in Ayodhya: అయోధ్య దీపోత్సవంలో ప్రధాని మోడీ.. సరయూ నది తీరంలో వేడుకలు
ముఖ్యంగా కొలంబోలో ‘మిస్ టూరిజం వరల్డ్ – ఇంటర్నేషనల్ ఫైనల్ 2022’ హోస్టింగ్ హక్కులను గెలుచుకున్న తర్వాత శ్రీలంక టూరిజం భారీ ఎక్స్‌పోజర్‌ను పొందుతోంది. డిసెంబర్ 8 నుంచి 21 వరకు జరిగే ఈ ఈవెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇస్తుంది, 80 దేశాల విజేతలు శ్రీలంకకు దాదాపు 40 మిలియన్ల యూఎస్ డాలర్లను అందిస్తారు. ప్రదర్శన సందర్భంగా, వారు శ్రీలంకలోని క్యాండీ, అనురాధపుర, పొలోన్నరువా, సిగిరియా, హబరానా, ఎల్లా, ఆరుగామ్ బే, మిరిస్సా, గాల్లెతో సహా అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. ఇది ఈ గమ్యస్థానాలను కూడా ప్రమోట్ చేస్తుందని ఆదివారం అబ్జర్వర్ నివేదించింది. ప్రస్తుతం శ్రీలంక నిధుల దుర్వినియోగం, అవినీతి, వ్యవసాయ సంక్షోభాల కారణంగా శ్రీలంక అపూర్వమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంక అపూర్వమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఏడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత దారుణంగా లక్షలాది మంది ఆహారం, మందులు, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు కష్టపడుతున్నారు.
