ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 3వ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయింది. ఆఫ్ఘాన్ బ్యాటింగ్‌లో రెహమత్ షా (90) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 316 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో 20 పరుగులకు మించి ఏ ఒక్క బ్యాటర్ కూడా పరుగులు సాధించలేదు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (17), సెడిఖుల్లా అటల్ (16), హష్మతుల్లా షాహిదీ డకౌట్, అజ్మతుల్లా ఒమర్జాయ్ (18), మహమ్మద్ నబీ (8), గుల్బాదిన్ నాయబ్ (13), రషీద్ ఖాన్ (18), నూర్ అహ్మద్ (9) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో కగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టాడు. లుంగీ ఎంగిడి, మల్డర్ తలో రెండు వికెట్లు తీశారు. మార్కో జన్‌సన్, కేశవ్ మహారాజ్‌కు చెరో వికెట్ దక్కింది.
Read Also: AP High Court: సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వానికి ఆదేశాలు
మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో ర్యాన్ రికెల్టన్ (103) శతకం బాదాడు. 106 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ బవుమా (58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (52), మార్క్రమ్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. ఫజల్హాక్ ఫారూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
Read Also: Wardha gang rape case: వార్ధా సామూహిక అత్యాచారం కేసు.. 8 మందిని నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు..