ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దీంతో.. ఆఫ్ఘాన్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో ర్యాన్ రికెల్టన్ (103) శతకం బాదాడు. 106 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. ఆ తర్వాత కెప్టెన్ బవుమా (58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (52), మార్క్రమ్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. ఫజల్హాక్ ఫారూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
AFG vs SA: సౌతాఫ్రికా భారీ స్కోరు.. ఆఫ్ఘనిస్థాన్ టార్గెట్ ఎంతంటే..?
- ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్
- భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికా
- 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
- ఆఫ్ఘానిస్తాన్ టార్గెట్ 316 పరుగులు.

Sa Vs Afg