Chicken Legs: ప్రపంచంలో చూసేందుకు చాలా వింత ప్రదేశాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టు వింతైన ప్రజలు ఉన్నారు. వింత వింత పోటీలు ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ తిండి తినే పోటీలను చూస్తూనే ఉన్నాం. జనాలూ ఏది పడితే అది తింటున్నారు. ఆ కోవలో వారు చేసే పనులు ఒక్కోసారి రికార్డులను కూడా తెచ్చిపెడుతున్నాయంతే అతిశయోక్తి కాదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం సౌతాఫ్రికా యువతి అచ్చం ఇలాంటి పనే చేసింది. తను సాధించిన ఈ అరుదైన ఫీట్ చూస్తూ వావ్.. అనాల్సిందే..
చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ చికెన్ లో వాటి లెగ్స్ ను చాలామంది ఇష్టపడరు వాటిని పడేస్తుంటారు. కానీ వాటినే తిని ఓ మహిళ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. సాధారణంగా ఫుడ్ ఫెస్టివల్స్ తరచుగా జరుగుతుంటాయి. తక్కువ సమయంలో ఎవరు ఎక్కువ ఫుడ్ తిన్న వారినే విజేతగా ప్రకటిస్తారు. సాధారణంగా చికెన్ తినే పోటీలు కూడా నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఈ పోటీల్లో పాల్గొన్న వారు క్షణాల్లో కోడిని లాగించే వారిని కూడా చూసే ఉంటారు. కానీ, కేవలం కోడి కాళ్లు మాత్రమే తినే పోటీని ఎప్పుడైనా చూశారా? అదీ ఉడకబెట్టిన కాళ్లను మాత్రమే తినడం. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఓ సౌతాఫ్రికా యువతి ఒక్క నిమిషంలో ఏకంగా మూడున్నర కోడి కాళ్లను కరకర నమిలేసి గిన్నిస్ రికార్డు దక్కించుకుంది.
Read Also: Nobel Peace Prize : ఈ ఏడాది నోబుల్ శాంతి బహుమతి ఎవరికి దక్కిందంటే..?
సౌతాఫ్రికాకు చెందిన వుయోల్వెతు సిమానైల్ అనే మహిళ కోడి కాళ్లు తినడంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒక్క నిమిషంలో ఆమె మూడున్నర కోడి కాళ్లు తిని గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. స్టంబో రికార్డు బ్రేకర్స్ అనే ఎపిసోడ్ లో భాగంగా సిమానైల్ తో పాటు మరో ముగ్గురు యువతులు కోడి కాళ్లు తినే పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో వుయోల్వెతు సిమానైల్ ఒక్క నిమిషంలో మూడున్నర కోడి కాళ్లను నమిలి మింగేసింది. మిగతా ముగ్గురిలో ఏ ఒక్కరూ ఆమె తిన్న దాంట్లో సగం కూడా తినలేకపోయారు.
డర్బన్ ఉమ్లాజీ ఏరియాలోని మషాంప్లేన్స్ లాంజ్ రెస్టారెంట్ అండ్ బార్ లో ఈ పోటీ జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న వారికి ఇచ్చిన ఒక్కో కోడి కాలు 35 గ్రాముల బరువును కలిగి ఉంది. దీన్ని బట్టి చూస్తే సిమానైల్ నిమిషంలో దాదాపు 120 గ్రాములకు పైగా కోడి కాళ్లు నమిలేసింది అన్నమాట. వాస్తవానికి నిమిషంలో 120 గ్రాముల చికెన్ తినడం సులభమే. కానీ, గట్టి ఎముకలు ఉండే కాళ్లను తినడం అంత ఈజీ కాదు. అంతేకాదు, ప్రతి వేలుకు పదునైన గోళ్ల కూడా ఉంటాయి. వాటిని కొరికి మింగడం సులభం కాదు. ఈ కఠినమైన పోటీలో పాల్గొని ఎక్కువ కోడికాళ్లను తిన్నది కాబట్టే సిమానైల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది.