NTV Telugu Site icon

AFG vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..

Afg Vs Sa

Afg Vs Sa

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. నేడు ఆఫ్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో గెలవాలని రెండు జట్లు కోరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. ఆఫ్ఘనిస్తాన్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీలతో స్పిన్ విభాగంలో బలంగా ఉంది.

Read Also: Koneru Konappa: కాంగ్రెస్కు భారీ షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి న్గిడి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసి, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, కార్బిన్ బాష్.

అఫ్గానిస్తాన్: హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నయీబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నాంగ్యాల్ ఖరోటి, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నవీద్ జద్రాన్.