WI vs SA: వెస్టిండీస్ కు సొంత గడ్డపై గట్టి షాక్ తగిలింది. తాజాగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను సౌతాఫ్రికా జట్టు 1 – 0 తో కైవసం చేసుకుంది. మొదటి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత, రెండవ టెస్టులో 40 పరుగుల తేడాతో సఫారీలు గెలిచారు. రెండో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 160 స్కోర్ చేయగా, విండీస్ 144 పరుగులకే పరిమితమైంది. ఇక స్వల్ప లీడ్ తో రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 246 రన్స్ చేసి, మొత్తంగా 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక కరీబియన్ జట్టు మాత్రం తాగేట్ ను ఛేదించే క్రమంలో కేవలం 222 స్కోరుకే ఆలౌట్ అయ్యింది. దింతో 40 పరుగుల తేడాతో సఫారీలు గెలిచి విజయాన్ని అందుకున్నారు.
Nokia Super Fan: 3615 నోకియా మొబైల్స్ కలెక్షన్‌తో రికార్డ్ సాధించిన వ్యక్తి..
ఇక ఈ టెస్ట్ లో అద్భుతంగా రాణించిన సఫారీ ఆటగాడు వియాన్ ముల్డర్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 6 వికెట్లు, 34 పరుగులు జోడించడంతో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ ను అందుకున్నాడు. ఇక సిరీస్ లో అద్భుతంగా రాణించిన కేశవ్ మహారాజ్
13 వికెట్లు తీయడంతో ప్లేయర్ అఫ్ ది సిరీస్ ను కైవసం చేసుకున్నాడు.
Guinness World Record: వామ్మో.. నాలుకతోనే బయపెట్టేస్తుందిగా..