Site icon NTV Telugu

SA vs NZ: జాన్సెన్ హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్‌ టార్గెట్‌ 170 పరుగులు..

Sa Vs Nz

Sa Vs Nz

టి20 వరల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్ ఈరోజు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 169 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రోటీస్ తరఫున మార్కో జాన్సెన్ 30 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డెవాల్డ్ బ్రెవిస్ 34 పరుగులతో రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ తరఫున మాట్ హెన్రీ, కోల్ మెక్‌కాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు. గెలిచిన జట్టు మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

Exit mobile version