Womens World Cup 2025: గౌహతి వేదికగా జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Wolvaardt) ఆడిన శతక ఇన్నింగ్స్‌తో ఆఫ్రికన్ జట్టు ఇంగ్లాండ్‌పై 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 143 బంతుల్లో 169 పరుగులు (20 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయడంతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించింది. ఆమెతో పాటు టజ్మిన్ బ్రిట్స్ (45), మారిజాన్ క్యాప్ (42), క్లోయ్ ట్రయాన్ (33*)లు విలువైన పరుగులు అందించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్ల్‌స్టోన్ (4/44) మాత్రమే ప్రభావం చూపించింది. అలాగే లారెన్ బెల్‌కు 2 వికెట్లు దక్కాయి.
890cc ఇంజన్, మరిన్ని క్రేజీ ఫీచర్స్ తో 2025 Ducati Panigale V2 లాంచ్.. ధర ఎంతంటే?
ఇక 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టు ప్రారంభం నుంచే వికెట్లను కొల్పుతూ వచ్చింది. కేవలం ఒక పరుగుకే టాప్ 3 వికెట్లు కోల్పోయి ఆ తర్వాత గేమ్‌లోకి తిరిగి రావడంలో విఫలమైంది. కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్ (64), అలిస్ క్యాప్సీ (50) పరుగులతో మాత్రమే కొంత ప్రతిఘటించారు. వారి తప్పితే ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎవరూ నిలువలేకపోయారు. దీనితో ఇంగ్లాండ్ జట్టు చివరికి 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగంలో మారిజాన్ క్యాప్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆమె కేవలం 7 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అలాగే అయాబోంగా ఖాకా, నాడీన్ డి క్లర్క్, నోన్కులెల్కో మ్లాబా, సునే లూస్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ సాధించారు. ఇక కెప్టెన్సీతో పాటు శతకంతో రాణించిన లారా వోల్వార్డ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది. దక్షిణాఫ్రికా మహిళలు ఈ విజయంతో తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించారు. ఇక ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు గురువారం టీమిండియా, ఆసీస్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది.
Rohit Sharma: కమ్ బ్యాక్ అంటే ఇది కదరా.. మొదటిసారి ‘టాప్’ లేపిన హిట్ మ్యాన్..!
THE MOMENT SOUTH AFRICA QUALIFIED FOR THE WOMEN’S WORLD CUP FINAL. pic.twitter.com/qKp1Gm6I8a
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2025