Fake Certificates: హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికెట్స్ తయారీకి సంబంధించి మరో షాకింగ్ ముఠా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (SOT) పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడిలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా “శ్రీ వ్యాస కన్సల్టెన్సీ” పేరుతో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తోంది. కూకట్ పల్లిలోని KPHB ప్రాంతంలో “శ్రీ వ్యాస కన్సల్టెన్సీ” అనే పేరుతో ఈ ముఠా నకిలీ B.Com, B.Tech సర్టిఫికెట్లు తయారు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తోంది. SOT శంషాబాద్ బృందం తమ దాడిలో ఇద్దరు ప్రధాన నిందితులు ఆకాసపు హరీష్, మావూరి మహేష్ లను అరెస్ట్ చేసింది.
Horoscope Today: శనివారం దినఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
ఈ నకిలీ ముఠాలో విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ముఠాకు సహకారం అందించినట్లు సమాచారం. నిందితులు ఇప్పటివరకు మొత్తం 46 మందికి నకిలీ సర్టిఫికెట్స్ అందించినట్లు వెల్లడైంది. ఈ ముఠా తయారుచేసిన నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా 24 మంది అభ్యర్థులు విదేశాలకు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సర్టిఫికెట్స్ లేకుండానే వీసా పొందడానికి వీరు ప్రయత్నించారని తెలుస్తోంది. సర్టిఫికెట్ల కోసం భారీగా డబ్బులు వసూలు చేసిన ముఠా, విద్యార్థులను మోసం చేసిన తీరు పోలీసులకు సవాల్ గా మారింది.
Sir Madam : తమిళ్లో సూపర్ హిట్.. తెలుగులో వచ్చేవారం రిలీజ్
నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ నిందితులను కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా విదేశీ వీసాలు పొందిన వారిపై విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ముఠాలో ఇంకెవెవరు భాగస్వాములుగా ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
