SONY-TCL: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సోనీ (SONY), టిసిఎల్ (TCL) భాగస్వామ్యం దిశగా ముందడుగు వేశాయి. ఈ మేరకు రెండు కంపెనీలు మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. సోనీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని నిర్వహించేలా ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించనున్నారు. ప్రతిపాదిత నిర్మాణంలో TCLకు 51 శాతం వాటా, సోనీకి 49 శాతం వాటా ఉండనుంది. అయితే ప్రస్తుతం ఇది కేవలం చర్చల దశలోనే ఉందని, ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని రెండు సంస్థలు స్పష్టం చేశాయి.
6.9mm స్లీక్ డిజైన్, AMOLED డిస్ప్లే, Exynos 1680 చిప్ తో రాబోతున్న Samsung Galaxy A57..!
ఈ చర్చలు తుది దశకు చేరితే.. ఈ కొత్త జాయింట్ వెంచర్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. ఉత్పత్తుల డిజైన్, డెవలప్మెంట్ నుంచి తయారీ, విక్రయాలు, లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్ వరకు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం చైన్‌ను ఇది చూసుకుంటుంది. ముఖ్యంగా ఈ భాగస్వామ్యంలో టెలివిజన్లు, హోమ్ ఆడియో ఉత్పత్తులు ప్రధానంగా ఉంటాయి. రెండు కంపెనీలు 2026 మార్చి చివరికి బైండింగ్ ఒప్పందాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అవసరమైన అనుమతులు లభిస్తే 2027 ఏప్రిల్‌లో కొత్త సంస్థ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.
Trump: దావోస్ వెళ్తుండగా ఎయిర్‌పోర్స్ వన్‌లో సాంకేతిక లోపం.. తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయిన ట్రంప్
ఈ జాయింట్ వెంచర్ ద్వారా సోనీ, TCL కలిసి ప్రీమియం ఆడియో–విజువల్ నైపుణ్యాన్ని, గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల వేగం, స్కేల్‌తో కలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉత్పత్తులు Sony, BRAVIA బ్రాండ్ పేర్లతోనే మార్కెట్లో ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్ టీవీలకు డిమాండ్ పెరుగుతుండటం ఈ భాగస్వామ్యానికి కీలక కారణంగా మారింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, వీడియో షేరింగ్ యాప్స్, స్మార్ట్ టీవీ ఫీచర్లు, అధిక రిజల్యూషన్ డిస్‌ప్లేలు వినియోగదారుల అలవాట్లను మారుస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూనే, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ పెంచడమే ఈ జాయింట్ వెంచర్ లక్ష్యం.
