రాజీవ్ గాంధీని (Rajiv Gandhi) పెళ్లి చేసుకోకముందు సోనియా గాంధీ (Sonia Gandhi) మన దేశానికి వచ్చిన కొత్తలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోనియా గాంధీ తన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చారు. జనవరి 1968లో సోనియా గాంధీ ఇండియాలో అడుగుపెట్టారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రాజీవ్ గాంధీ, ఆయన తమ్ముడు సంజయ్ గాంధీ (Sanjay Gandhi) తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు. ఆ తర్వాత ఆమెను నేరుగా ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ (Harivansh Rai Bachchan), తేజీ బచ్చన్ (Teji Bachchan) దంపతుల ఇరవై (13, విల్లింగ్డన్ క్రెసెంట్) ఇంటికి తీసుకెళ్లారు. అప్పట్లో ఇందిరా గాంధీకి (Indira Gandhi) బచ్చన్ కుటుంబంతో మంచి స్నేహం ఉండటంతో.. సోనియా పెళ్లికి ముందు అక్కడే బస చేశారు.
ఆ కొత్త వాతావరణం, తెలియని ఆచారాలు, అస్సలు మాట్లాడలేని భాష మధ్య సోనియా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో బచ్చన్ కుటుంబం ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. తేజీ బచ్చన్ జాకెట్, స్లాక్స్ వేసుకుని, తలకి ఫ్రెంచ్ స్టైల్ స్కార్ఫ్ చుట్టుకుని ఎంతో ఆప్యాయంగా సోనియాను హత్తుకుని స్వాగతం పలికారు. ఆమె సోనియాకు ఓ తల్లిలా మారి అన్ని విషయాలు నేర్పిస్తూ తోడుగా నిలిచారు. రాజీవ్ గాంధీ సోనియా కోసం తన రూమ్‌ను ఎంతో అందంగా అలంకరించారు. బెడ్ వెనుక పబ్‌లో పికాసో బ్లూ పీరియడ్ (Pablo Picasso Blue Period) పెయింటింగ్ రిప్రొడక్షన్ పెట్టారు. టేబుల్ మీద సువాసన వెదజల్లే గులాబీలు, రంగురంగుల రగ్గులు వేశారు. అయితే బాత్రూమ్లో పాత కార్పెట్ వేయడం వల్ల దానికి వాడిన పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ సోనియాకు ఆస్తమా అటాక్ (Asthma attack) వచ్చేలా చేసింది. వెంటనే రాజీవ్, తేజీ బచ్చన్ ఆమెకు మందులు ఇచ్చి జాగ్రత్తగా చూసుకున్నారు.
ఉదయాన్నే హరివంశరాయ్ బచ్చన్ కిటికీ బయట నడుస్తుంటే ఆ అడుగుల చప్పుడుతో సోనియా మెలకువ వచ్చేది. ఆ తర్వాత ఆయన శంఖం ఊదే శబ్దం, పూజా గంటల మోత వినిపించేవి. ఆయనను చూస్తే ఏదో స్టోరీ బుక్‌లోని క్యారెక్టర్లా అనిపించేదని సోనియా గుర్తు చేసుకున్నారు. కొద్దిగా హిందీ నేర్పించే ప్రయత్నం చేసిన హరివంశరాయ్ బచ్చన్.. సోనియాతో ఒక మాట చెప్పారు. “ఈ దేశంలో నువ్వు ఏంటనేది ముఖ్యం కాదు, ప్రజలు నిన్ను ఏలా చూస్తున్నారనేదే ముఖ్యం” అని హెచ్చరించారు. అప్పట్లో ఆ మాట అర్థం కాకపోయినా, తర్వాత కాలంలో పబ్లిక్ ఒపీనియన్ (Public opinion) ఎంత త్వరగా మారుతుందో అర్థమయ్యాక ఆయన ఎంత గొప్ప మాట చెప్పారో సోనియా గ్రహించారు. పెళ్లికి ముందు తనను కంటికి రెప్పలా చూసుకున్న బచ్చన్ దంపతులను సోనియా తన ‘తాత్కాలిక ఫోస్టర్ పేరెంట్స్’ (Temporary foster parents) గా అభివర్ణించారు. ఆ రోజుల్లో తాను పడిన ఇబ్బందులను, అమితాబ్ ఫ్యామిలీ ఇచ్చిన లవ్ అండ్ కేర్‌ను హార్పర్‌కోలిన్స్ (HarperCollins) పబ్లిష్ చేసిన ఈ పుస్తకంలో ఎంతో మనసుకి హత్తుకునేలా రాశారు.

