Site icon NTV Telugu

Congress: నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Congress

Congress

Rajya Sabha Election: కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అయింది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో సోనియా గాంధీతో పాటు బిహార్ నుంచి డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండోర్‌ని అభ్యర్థులుగా ప్రకటించారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Read Also: IPO Listing Today: ఇన్వెస్టర్లకు నిరాశ మిగిల్చిన కొత్త ఐపీవోలు

కాగా, 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ పత్రాల దాఖలుకు రేపే చివరి రోజు. ఇక, బీజేపీ, బీజేడీ, టీఎంసీ సహా పలు పార్టీలు ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు కేవలం నాలుగురిని మాత్రమే ప్రకటించింది. ఇతర అభ్యర్థుల పేర్లపై పార్టీలో మేధోమథనం కొనసాగుతోంది.

Exit mobile version