Site icon NTV Telugu

Sonia Gandhi: అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ.. ఆసుపత్రికి తరలింపు

Sonia Gandhi

Sonia Gandhi

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర దగ్గుతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. భారీ వాయు కాలుష్యం వల్లే సోనియాకు అనారోగ్యం కలిగినట్లు తెలుస్తోంది. సీనియర్ పల్మోనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read:Redmi Note 15 5G: 108MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌తో.. రెడ్‌మి నోట్ 15 5G విడుదల

సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో, పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి 2000లలో 16 రాష్ట్రాలను పరిపాలించింది. తదనంతరం ఆమె 2017లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

Exit mobile version