Site icon NTV Telugu

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో మరో కంటెస్టెంట్ అవుట్.. ఎవరంటే?

Bb8

Bb8

రియల్టీ షో బిగ్‌బాస్ తెలుగు ‘బిగ్ బాస్ తెలుగు 8’ నాల్గవ వారంలోకి ప్రవేశించింది. ఈ సీజన్ లో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే బేబక్క, శేఖర్‌ బాషా, అభయ్‌ నవీన్‌ వరుసగా ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వారం సోనియా ఎలిమినేట్ అయ్యింది. పోల్ ఫలితాల ప్రకారం.. నబీల్ అఫ్రిది 99,143 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. 33% మద్దతును పొందాడు. నాగ మణికంఠ 50,428 ఓట్లతో (17%), ఆదిత్య ఓమ్ 44,545 ఓట్లతో (15%), ప్రేరణ 44,516 ఓట్లతో (15%), పృథ్వీరాజ్ 38,670 ఓట్లతో (13%) నిలిచారు. సోనియా అకుల కేవలం 22,911 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. కేవలం 8% ఓట్లను మాత్రమే సాధించారు.

READ MORE: Whatsapp: నంబర్‌ సేవ్ చేయకుండా ఈ ట్రిక్‌తో వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు..!

అయితే సోనియా ఎలిమినేషన్‌ని జనం శాసించడంతో ఆమెను ఎవ్వరూ కాపాడలేకపోయారు. హోస్ట్ నాగార్జున కూడా చేతులెత్తేశారు. జనాలు కోరుకున్నట్లుగానే బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా వెనుదిరిగింది. అయితే సోనియా వల్ల నిఖిల్ ఆట షెడ్‌కి వెళ్లిపోయిందని.. ఈ మిస్ వల్లే అతని ఆట మిస్ ఫైర్ అయ్యిందనే విషయం అందరికీ తెలుసు. నిఖిల్ సోనియాని గుండెకాయ అంటూ బయటకు పంపే ప్లాన్ వేశాడని టాక్. అయితే సోనియాను బిగ్‌బాస్‌ ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ఆదిత్య ఓంను కూడా ఎలిమినేట్ చేయనున్నారని టాక్‌ వినిపించినా అది వార్తగానే మిగిలిపోయింది. అయితే సోనియాను ఎలిమినేట్ చేసినట్లే చేసి, సీక్రెట్‌ రూమ్‌లో ఉంచే అవకాశాలు ఉన్నాయన్న వాదన కూడా వినిపించింది. ఇన్ని పుకార్ల నేపథ్యంలో తాజాగా సోనియా ఎలిమినేషన్ జనాలకు ఊరటనిచ్చింది.

Exit mobile version