Site icon NTV Telugu

Sonam Kapoor : మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోలు వైరల్

Sonam Kapoor

Sonam Kapoor

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లికాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం హడావిడి చేస్తోంది. పింక్ షేడ్‌లో ఉన్న ఫ్లోయింగ్ డ్రెస్లో సోనమ్ గ్లో పూర్తిగా మెరిసిపోగా, ఆ క్షణాలను అభిమానులు ప్రేమగా షేర్ చేస్తున్నారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో సోనమ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2022లో వీరి దంపతులకు మొదటి బిడ్డగా కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి ‘వాయు’ అనే అందమైన పేరు పెట్టారు. ఇప్పుడు ఆమె రెండోసారి మదర్‌హుడ్ జర్నీలోకి అడుగుపెడుతున్నారని చెప్పడంతో అభిమానుల్లో మరోసారి ఆనందం వెల్లివిరుస్తోంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురైన సోనమ్, సినిమాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా తన ఫ్యాషన్ సెన్స్, క్లాసీ స్టైల్‌తో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కొత్త ఫోటోలు చూసి బీ-టౌన్ సెలబ్రిటీలు, స్నేహితులు, అభిమానులు ఆమెకు వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

Exit mobile version