Site icon NTV Telugu

Sonakshi Sinha: పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ఇస్లాంలోకి మారుతుందా..? జహీర్ ఇక్బాల్ తండ్రి సంచలన ప్రకటన..

Sonakshi Sinh

Sonakshi Sinh

Sonakshi Sinha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని ఈ నెలలో పెళ్లి చేసుకోబోతోంది. సోనాక్షి,జహీర్ ఇక్బాల్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివరాలను సోనాక్షి తండ్రి శత్రుఘ్ను సిన్హా సన్నిహితుడు శశి రంజన్ పంచుకున్నారు. ఈ పెళ్లికి శత్రుఘ్ను సిన్హా సోదరులు అమెరికా నుంచి వస్తున్నట్లు ఆయన వెళ్లడించారు. జహీర్ ఇక్బాల్ ఇంట్లో రిజస్టర్ మ్యారేజ్ జరుగుతుందని, ఇది తమ కుటుంబాలకు సంతోషకమైన క్షణమని అన్నారు.

Read Also: Petrol price hike: గోవాలోనూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా తల్లి, సోదరుడు ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరికి ఈ పెళ్లి ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి. అయితే వీటిని శత్రఘ్ను సిన్హా కొట్టిపారేశారు. గతంలో ఈ వివాహానానికి శత్రఘ్ను సిన్హా కూడా హాజరుకావడం లేదని పుకార్లు వచ్చాయి. వీటిని ఖండిస్తూ, ఇది నా ఏకైక కుమార్తె సోనాక్షి వివాహమని, పెళ్లికి ఖచ్చితంగా తాను ఉంటానని చెప్పారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ఇస్లాం మతంలోకి మారుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జహీర్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ సంచలన ప్రకటన చేశారు. పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాంలోకి మారుతుందనే వార్తల్ని ఆయన తోసిపుచ్చారు. ఈ పెళ్లి హిందూ లేదా ఇస్లాం సంప్రదాయాన్ని కలిగి ఉండదని, ఇది సివిల్ మ్యారేజ్ అని చెప్పారు. ఆమె మతం మారడం లేదని, ఇది ఖచ్చితమని చెప్పారు. వారి హృదయాల కలయి, మతానికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. నేను మానవత్వాన్ని నమ్ముతానని, దేవుడిని హిందువులు భగవాన్ అని, ముస్లింలు అల్లాని పిలుస్తారని, కానీ చివరికి మనమంతా మనుషులమని చెప్పారు. తన ఆశీస్సులు జహీర్, సోనాక్షిలకు ఉంటాయని అన్నారు. 2020 నుంచి సోనాక్షి, జహీర్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారు 2022లో డబుల్ ఎక్స్ఎల్ సినమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Exit mobile version