Site icon NTV Telugu

Vikarabad: వీడు మనిషి కాదు.. మానవమృగం.. కన్నతల్లినే కిరాతకంగా..

Vikarabad

Vikarabad

వీడు మనిషి కాదు.. మానవమృగం.. కన్నతల్లి నే కిరాతకంగా హతమార్చాడు.. బండరాయితో మోది తల్లిని చంపి పరారయ్యాడు. చంపింది కొడుకే అని తెలిసి.. గ్రామస్తులంతా షాక్‌ అయ్యారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఎందుకు చంపాడు..? హత్య చేసి.. ఆపై ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌ వేద్దామనుకున్నాడు..? ఇది వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్‌ గ్రామం. గ్రామానికి చెందిన 62 ఏళ్ల మల్లమ్మ రక్తపుమడుగులో పడి ఉంది. గమనించిన స్థానికులు వెళ్లి చూడగా… అప్పటికే మల్లమ్మ చనిపోయింది. ఎవరో తీవ్రంగా దాడి చేసి హతమార్చారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆధారాలు సేకరించి మల్లమ్మ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

Also Read:Donald Trump: “ప్రపంచంలోనే చెత్త మేయర్”.. సాదిక్ ఖాన్‌పై ట్రంప్ ఫైర్..

దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గ్రామస్తులు ఓ కీలక సమాచారం అందించారు. మల్లమ్మతో.. కొడుకు అంజిలయ్య నిత్యం గొడవపడేవాడని.. తాగొచ్చి అప్పుడప్పుడు కొట్టేవాడని చెప్పారు. అప్పటికే అంజిలయ్య కూడా పరారీలో ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంజిలయ్యను గాలించి పట్టుకున్నారు. తన తల్లిని తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు అంజిలయ్య. తల్లికి వచ్చిన పింఛన్‌ డబ్బుల కోసమే హతమార్చినట్లు చెప్పాడు అంజిలయ్య. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వలేదని.. పింఛన్‌ డబ్బులు వచ్చాయి కదా ఇవ్వమని అడిగినా నిరాకరించడంతో రాయితో కొట్టిచంపినట్లు ఒప్పుకున్నాడు అంజిలయ్య.

Also Read:మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

కేసు నమోదు చేసిన పోలీసులు.. అంజిలయ్యను రిమాండ్ కు తరలించారు. తల్లిని హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోతే.. ఎవరో దొంగలు వచ్చి చంపి ఉంటారని గ్రామస్తులంతా అనుకుంటారని, తనకేం తెలియనట్టు ఇంటికి చేరుకుందామని ప్లాన్‌ చేశాడు అంజిలయ్య. కానీ.. తల్లిని నిత్యం కొడుతూ వేధించడం చూసిన గ్రామస్తులు అనుమానించడంతోనే అసలు విషయం బయటకొచ్చింది.

Exit mobile version