NTV Telugu Site icon

Psycho Son : కత్తులతో 282 సార్లు పొడిచి తల్లిదండ్రులను చంపిన కొడుకు

Friend Murder

Friend Murder

Psycho Son : నవమాసాలు కనిపెంచిన తల్లిదండ్రులను అతికిరాతకంగా చంపాడో దుర్మార్గుడు. ఏకంగా మూడు కత్తులతో 282సార్లు పొడిచి మరీ వారి ప్రాణాలు బలితీసుకున్నాడు. ఈ దిగ్ర్భంతికరమైన సంఘటన ఇంగ్లండ్లోని యార్క్ షైర్ లో చోటు చేసుకుంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. జాన్, బెవర్లీ దంపతుల కుమారుడు డేవిడ్.. ఇతడి వయసు 37ఏళ్లు. డేవిడ్ తన తల్లి, తండ్రిని 282 సార్లు కత్తులతో పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ క్రూరమైన దాడిలో మూడు వేర్వేరు కత్తులు ఉపయోగించాడు. ఇటీవల తల్లిదండ్రుల హత్య కేసులో కుమారుడిపై కోర్టులో విచారణ జరిగింది.

Read Also: Thief Rat : శవం కన్ను మాయం.. ఎలుక పైనే అనుమానం

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హత్య చేసిన తర్వాత డేవిడ్ పోలీసుల కోసం ఇంటి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రక్తంతో తడిసిన రెండు మృతదేహాలు లోపల పడి ఉన్నాయి. డేవిడ్ తన తల్లిదండ్రులను హత్య చేసినట్లు అంగీకరించాడు.

Read Also: Dead Human Bones : స్వామి చెప్పాడని శ్మశానానికి తీసుకెళ్లి శవాల బూడిద తినిపించారు

ఈ విషయం బ్రాడ్‌ఫోర్డ్ క్రౌన్ కోర్టులో జనవరి 20, 2023న విచారణ జరిగింది. ఈ సమయంలో, డేవిడ్ చాలా సంవత్సరాలుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. కొన్ని నెలల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. అతను స్కిజోఫ్రెనియా, పారానోయిడ్ సైకోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. డేవిడ్ దాడికి ఒక రోజు ముందు (డిసెంబర్ 20, 2021) వైద్యుడిని కూడా కలిశాడు..డేవిడ్ తన తల్లిపై 90కి పైగా పోట్లు వేసినట్లు కోర్టులో తెలిపారు. అదే సమయంలో, తండ్రిపై 180 సార్లు దాడి జరిగింది. అతను హింసాత్మకంగా, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నందున అతన్ని జైలులో ఉంచమని కోర్టు అధికారులను ఆదేశించింది.

Show comments