Site icon NTV Telugu

Kumuram Bheem Asifabad: అమానవీయ ఘటన.. విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుమారుడు.. మృత దేహాన్ని నదిలో పడేసిన తండ్రి

Jayender

Jayender

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రినన్న విషయం మరిచి విద్యుత్ షాక్ తో మృతి చెందిన కొడుకు మృత దేహాన్ని నదిలో పడేశాడు. సిర్పూర్ టి మండలం టోంకిని కి చెందిన జయేందర్( 19 ) పంట చేనుకు వేసిన విద్యుత్ కంచె (ఫెన్సింగ్ )తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నేరం తనమీదకు వస్తుందని భయాందోళనకు గురైన తండ్రి మృత దేహాన్ని పెనుగంగ నదిలో పడేశాడు. ఆ తర్వాత కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read:US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఒకరు మృతి

కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువకుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పెను గంగా నదిలో యువకుడి మృత దేహాన్ని గుర్తించారు. డెడ్ బాడీపై షాక్ కొట్టిన ఆనవాళ్లు ఉండడంతో తండ్రిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. విద్యుత్ షాక్ తో మరణించిన కొడుకు మృతదేహాన్ని తానే నదిలో పడేసినట్టు తండ్రి చిరంజీవి అంగీకరించాడు. తండ్రి, ఆయనకు సహకరించిన పక్క చేను వ్యక్తి చెలిరాం పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version