అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ దుర్మార్గుడైన కొడుకు తన వృద్ధ తల్లిదండ్రుల గొంతు కోసి హత్య చేశాడు. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి ఓ పాట పాడాడు. హంతకుడి చర్యలను చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. కాగా.. నిందితుడు తప్పించుకునే క్రమంలో అతన్ని పోలీసులు షూట్ చేశారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Read Also: Annamalai: “సుపర్ స్టార్ రజనీకాంత్ వాస్తవాలు చెప్పారు”.. స్టాలిన్ పై అన్నామలై సంచలన విమర్శలు
వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. 41 ఏళ్ల జోసెఫ్ బ్రాండన్ గెర్డెవిల్లే తన తల్లి ఆంటోయినెట్ (77), తండ్రి రోనాల్డ్ (79)లను దారుణంగా హత్య చేశాడు. ఏదో సమస్యపై తల్లిదండ్రుల గొంతు కోసి హతమార్చాడు. అంతేకాకుండా.. వారి తలలను మొండెం నుంచి వేరు చేసి ఆ ఫోటోలను తన బంధువులకు పంపాడు. ఈ క్రమంలో.. అతని సోదరుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను గుర్తించారు. అందులో ఒకరి తల టేబుల్‌పై కనిపించింది. పోలీసులను చూసి నిందితుడు జోసెఫ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. అతనిపై ఐదు బుల్లెట్లు కాల్చారు. కాగా.. ఈ ఘటన జూలై 9న జరిగింది.
Read Also: Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేతికి సంకెళ్లు వేస్తుండగా.. నిందితుడు వారి ముందు ఓ పాట పాడాడని చెప్పారు. ఐ లవ్ యూ అనే పాత హాలీవుడ్ పాట పాడాడని అన్నారు. తనను చంపేయాలని కోరాడన్నారు. అయితే.. పోలీసులు తీవ్ర గాయాలైన నిందితుడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స తర్వాత జైలుకు తీసుకెళ్లారు. కాగా.. హత్య నేరంలో నిందితుడికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.