వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ ఓ మంచి బాలుడు, గుణవంతుడు అని ఎద్దేవా చేశారు. జైళ్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని, మహిళా ఎమ్మెల్యేని విమర్శించిన ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ చాలా సేపు పలకరించారని విమర్శించారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎంతో మంది జగన్ వల్ల జైళ్లకి పోతున్నారన్నారు. తమ నేతలు ఎంత మందిపై కేసులు పెట్టారు? అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంతో జగన్ వల్ల 40 మంది నిందితులు అయ్యారని, 12 మంది జైళ్లకి వెళ్లారని సోమిరెడ్డి పేర్కొన్నారు.
Also Read: Nara Lokesh: వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా?.. మంత్రి లోకేష్ ఆసక్తికర కామెంట్!
‘వైఎస్ జగన్ దురాశ వల్లే మిథున్ రెడ్డి జైలు పాలయ్యాడు. కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి మీద అటాక్ చేసిన వాళ్లు సర్వేపల్లి నియోజకవర్గంలో తలదాచుకున్నారు. సీఎం చంద్రబాబు వయసుకైనా జగన్ రెడ్డి గౌరవం ఇవ్వాలి కదా?. జగన్ వల్లే ఎంతో మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు జైలుకు వెళ్లారు. జగన్ సిగ్గుతో తలదించుకోవాలి. వైసీపీ అక్రమ మైనింగ్ పై ప్రధానితో సహా అందరికి పిర్యాదు చేశాను. కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేశారు కాబట్టే జైల్లో ఉన్నాడు. కాకాణి రూ.150 కోట్ల అక్రమ మైనింగ్ చేశారు. జగన్ రెడ్డి ధనదాహానికి 30 వేల మంది అమాయకులు చనిపోయారు. జగన్ నర హంతకుడు. పుష్ప సినిమా తరహాలో జగన్ సొంత బ్రాండ్లు పెట్టి స్కాంకు పాల్పడ్డారు’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.
