somireddy chanramohan reddy టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు కూతురు ఉమా మహేశ్వరీ మరణంపై టీడీపీ పౌలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి (somireddy chanramohan reddy )కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమా మహేశ్వరీ మరణంపై దమ్ముంటే సీబీఐ విచారణ చేయించుకోవాలని సోమిరెడ్డి సవాల్ విసిరారు. ఉమా మహేశ్వరీ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి దానికి కట్టుబడి ఉండాలని, అలాగే లక్ష్మీపార్వతి తీరుపై సోమిరెడ్డి ఫైర్ అయ్యారు.
ఎన్టీఆర్ కుటుంబంపై నీచ ప్రచారమా..? వైసీపీ నేతలు అసలు మనుషులేనా..? ఉమామహేశ్వరీ మరణంపై దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి సీబీఐ విచారణ వేయించుకోవాలి. విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతిలు మాత్రం మానవత్వం లేకుండా నీచంగా వ్యవహరించారు. నిజాలు మాట్లాడటాన్ని విజయ సాయిరెడ్డి ఎప్పుడో మర్చిపోయారు. 16 నెలలు జైల్లో ఉన్న ఆయన అబద్ధాలు చెప్పడానికే పనికొస్తాడు. వేల కోట్లు ఆస్తులు పోగేసుకున్న విజయసాయి రెడ్డీ.. ఇంకా ఎందుకు ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నారో..? అప్పుడేమో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంటి పెరట్లో ఉందని కూశారు.. అసలు డైమండే లేదని ధర్మారెడ్డే చెప్పాడు.
Dil Raju: షూటింగ్స్ ఆపేశాం.. నాలుగు కమిటీలు పని చేస్తున్నాయి
విజయసాయి రెడ్డి, లక్ష్మీ పార్వతి ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. పులివెందులలో జగన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డిని నరికి నరికి చంపారు. మొదట హార్ట్ అటాక్ అని విజయ సాయి రెడ్డే వీధి నాటకమేశారు. ఆ తర్వాత చంద్రబాబు చంపించాడని పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఇప్పుడేమో ఆ హత్య కేసు మీద అసలు సీఐబీ విచారణే వద్దని జగనే చెప్పుకుంటున్నాడు. జగన్ చెల్లెలు సునీతేమో సీబీఐ కావాలని డిమాండ్ చేస్తోంది.
అసలు సమాజంలో ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారనే బుద్ధి కూడా లేదా..? వైసీపీకి దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయించుకోండి. రోజూ ఢిల్లీకి వెళ్లి అక్కడ కాళ్లు పట్టుకోవడం మీకు అలవాటే కదా..ఇప్పుడు కూడా కాళ్లు పట్టుకుని వేయించుకోండి. చంద్రబాబు, లోకేష్ అడిగితే సీబీఐ విచారణ జరపరనే విషయం జ్ఞానం కూడా మీకు లేదా..? లక్ష్మీపార్వతీ..అసలు మహిళేనా..? అని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
