నెల్లూరు జిల్లాలో అడ్డగోలు దోపిడీలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కాకాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎగిరిపోయారు..కాకాణి మంత్రి కావడంతో టిడిపికి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ నెల 7న టిడిపి జాతీయ అధ్యక్షుడు నెల్లూరులో పర్యటిస్తారు..వేణుగోపాల స్వామి కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తాం అన్నారు. నెల్లూరు జిల్లాలోగ్ అడ్డగోలు దోపిడీలు ఎక్కువైపోయాయని, అయినా పట్టించుకోవడం లేదన్నారు.
Read Also: Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. 22 మందితో వెళ్తూ లోయలో పడిన బస్సు
అక్రమ లేఔట్లు వెలుస్తున్నాయి.. నుడా బ్రతికుందా.. చనిపోయిందా అర్థం కావడం లేదు..ఇర్రిగేషన్ ఫండ్స్ వందల కోట్లు తినేశారు..ఇరిగేషన్ శాఖలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారే తప్ప పనులు చేయడంలేదు..ఇరిగేషన్, అక్రమ లేఔట్లు, సిలికాలో హద్దుల్లేని అవినీతి జరుగుతోంది..దోపిడిదారులతో కుమ్మకై లంచాలకు అలవాటుపడిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
Read Also: Mussoorie Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. 22 మందితో వెళ్తూ లోయలో పడిన బస్సు
