గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల అవినీతికి అప్పటి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఆయన మండిపడ్డారు. సూరాయపాలెంలో రూ. 54 కోట్లు, విరువూరులో రూ. 37 కోట్ల రూపాయల మేర పెనాల్టీని గనుల శాఖ విధించిందని, రైతుల పేరుతో అనుమతులు తెచ్చి లక్షల క్యూబెక్ మీటర్ల గ్రావెల్ ను తవ్వేశారన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రధాన దోపిడీదారుడైన కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Swag Movie Review: స్వాగ్ మూవీ రివ్యూ..శ్రీవిష్ణు హిట్ కొట్టాడా?
మైనింగ్ అధికారులు ఎందుకు ఆయనను విచారణ చేయడం లేదని, ఇది మంచి పద్ధతి కాదు.. కరోనా టైంలో హౌస్ లో కూర్చుని సర్వేపల్లిని దోచుకున్న వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన రూ.106 కోట్ల అవినీతి 10శాతం మాత్రమే అని, ఇంకా 90 శాతం బయటపడాలని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ఐదేళ్ల పాటూ అక్రమంగా ఇసుక, గ్రావెల్, సిలికా, తెల్లరాయి తవ్వకాలు జరిగాయని, ఈ అక్రమాలపై విచారణ చేయాలన్నారు. ఈ భారీ దోపిడీలో జగన్ ప్యాలస్ .. సజ్జలకు వాటాలు పంపారని, అక్రమంగా ప్రజల సొత్తు దోచేసిన కాకాణిని కటకటాల వెనక్కి పంపిస్తామననారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఆ దేవదేవుడు వదిలిపెట్టడన్నారు.
RK Roja : శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం