RSS in Jaipur: జైపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యక్రమం సందర్భంగా కత్తులు, కర్రలతో జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. శరద్ పూర్ణిమ సందర్భంగా జైపూర్ లోని కర్ణి విహార్‌లో ఖీర్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా.. గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, కర్రలతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఎమ్మెల్యే గోపాల్ శర్మ తదితరులు క్షతగాత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకునేందుకు ఆసుపత్రికి చేరుకున్నారు.
Read Also: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియా ఔట్! ఫైనల్‌కు దక్షిణాఫ్రికా
కల్నల్ రాథోడ్ ఘటన గురించి చెబుతూ.. ఖీర్ పంపిణీ కార్యక్రమంలో భజన్ కీర్తన జరుగుతోంది. ఈ సమయంలో ముగ్గురు అక్కడికి వచ్చి ముందుగా పెద్ద ఖీర్ కుండను తన్ని ఆపై దుర్భాషలాడారు. ఆ తర్వాత వారు 8 మందిపై కత్తితో దాడి చేసారని, దాంతో అక్కడ ప్రజలు వారిని పట్టుకున్నారని, ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. అక్కడి క్షతగాత్రులను విచారిస్తున్నామని, వారి కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలిపారు.
Read Also: Rishabh Pant injured: రిషబ్ పంత్ మోకాలికి గాయం.. సర్జరీ అయిన చోటే తగిలిన బంతి..