Site icon NTV Telugu

Group Exams : తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఈ గ్రూప్‌లలో మరిన్ని పోస్ట్‌లు

Ts Goverment

Ts Goverment

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌ పరీక్షల్లో మరిన్ని పోస్టులను కలుపుతూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2లో మరో 6 కేటగిరీల పోస్ట్ లను, గ్రూప్ 3 లో మరో రెండు కేటగిరీ ల పోస్ట్ లను, గ్రూప్ 4 లో మరో 3 కేటగిరీ పోస్ట్ లను యాడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్‌-,2 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది ప్రభుత్వం. వాటిలో ఉన్న పోస్టులకు తోడు మరిన్ని పోస్టులు చేరుస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన 55 జీవోలో సవరణలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read : Peddireddy RamachandraReddy: చంద్రబాబు బంట్రోతు పవన్ కళ్యాణ్

గ్రూప్-2లో.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిష్‌ సర్వీస్‌), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి), జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు చేర్చగా.. గ్రూప్-3లో.. గిరిజన సంక్షేమ శాఖ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్‌ఓడీల్లో ఇదే విధమైన పోస్టులు, గ్రూప్-4లో.. జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్), మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్, మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) పోస్టులు చేర్చుతున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం.
Also Read : Shraddha Walkar Case: 5 కత్తులతో శ్రద్ధా బాడీ ముక్కలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

Exit mobile version