NTV Telugu Site icon

Salaar 2 : “సలార్ పార్ట్ 2” రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.. వచ్చేది ఎప్పుడంటే ?

Salaar2

Salaar2

Salaar 2 : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 1 తెరకెక్కింది. ఈ సినిమా బావుందని కొంతమంది బాలేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. అయితే డబ్బులు మాత్రం దండిగానే వచ్చాయి కానీ ఆశించిన మేరకు రాకపోవడంతో సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు పలువురు బాలీవుడ్ క్రిటిక్స్ తో పాటు బడా మీడియా సంస్థల అధికారిక హ్యాండిల్స్ నుంచి న్యూస్ షేర్ అయింది. అయితే నిజానికి అది నిజం కాదని తెలుస్తోంది.

Read Also:Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కూలిపోయిన విమానం.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి

ప్రభాస్ ఆ సినిమా మీద ప్రస్తుతం ఫోకస్ చేయలేదని ఆయన మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి పౌజీ సినిమాల మీద ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. అయితే కావాలనే సలార్ 2 గురించి వార్తలు తెరమీదకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతానికి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మరే సినిమాలు మీద ఫోకస్ పెట్టే అంత టైం లేదు. ఎన్టీఆర్ సినిమా చేసిన తర్వాతే ఆయన వేరే సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన యష్ కేజిఎఫ్ త్రీ మీద ఆ తర్వాత అవకాశం ఉంటే సలార్ 2 మీద ఫోకస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Read Also:IND vs WI: మెరిసిన స్మృతి, రేణుక.. 211 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం!

భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా నేటికి ఏడాది కావడంతో సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ అండ్ చిత్ర యూనిట్ కూడా ఆ వైబ్స్ లో ఉన్నారు. అయితే దీనికి సీక్వెల్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం గురించి అందరికీ తెలిసిందే. మరి దీనిపై మంచి హైప్ నెలకొనగా తాజాగా ఈ సినిమా రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ని 2026లో తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో రెబల్ ఫ్యాన్స్ ఈ సెన్సేషనల్ సీక్వెల్ కోసం అప్పుడు వరకు ఆగితే సరిపోతుందనే చెప్పాలి. మరి ఆ సినిమా ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి.