NTV Telugu Site icon

Daaku Maharaj : డాకు మహారాజ్ పై సాలిడ్ అప్ డేట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే ?

Daaku

Daaku

Daaku Maharaj : వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా NBK109. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ ఫైనల్ గా ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ పేరు ఫిక్స్ చేస్తూ ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టైటిల్ తో పాటు చిన్న టీజర్ కూడా విడుదల చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Read Also:Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 10 మంది సైనికులు మృతి

స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నాగ వంశీ నిర్మాణ సారథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తమన్ మరోసారి సంగీతం అందిస్తూ ఉండడంతో అఖండ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. దానికి తోడు నిన్ననే నాగ వంశీ అసలు బాలకృష్ణ గారి సినిమాలకి తమన్ మ్యూజిక్ ఎందుకు ఉండాలో ఈ టైటిల్ టీజర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ టీజర్ ఇపుడు సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుందనే చెప్పాలి.

Read Also:IPL 2025 Auction: ఆ భారత ఆటగాడిపై కన్నేసిన ఆర్‌సీబీ, సీఎస్‌కే.. కోట్ల వర్షమే ఇక!

అయితే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ అలాగే శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ అంతా శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఒక సాలిడ్ న్యూస్ వైరల్ అవుతుంది. డాకు మహారాజ్ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇపుడు టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ ట్రైలర్ ను జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో విడుదల చేసునున్నారట. అలాగే ఆ ఈవెంట్ గెస్ట్ కూడా చాలా స్పెషల్ అండ్ బిగ్ స్టార్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే డాకు మహారాజ్ నెక్స్ట్ బ్లాస్ట్ బస్టర్ కొట్టేలా ఉందనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Show comments