Solar Energy Pros and Cons: ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ లాంటి సాంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల్లోనే వీటి నిల్వలు ఆయిపోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రత్యామ్నయ వనరులపై దృష్టి సారించాయి. అందులో భాగంగానే డిజీల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో ఒక్కో యూనిట్ ధర గణనీయంగా పెరగవచ్చు కూడా. ఇది సామాన్యులకు భారంగా మారవచ్చు. జలవిద్యుత్ కంటే సౌర విద్యుత్ చౌకైనది. దీనిని ఉత్పత్తి చేయడానికి మనకి సోలార్ ప్యానెల్స్ ఉంటే సరిపోతుంది. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.
సూర్యుడు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి ప్రతి దేశం కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని తేలికగా ఇళ్లపైనే అమర్చకోవచ్చు. ఇక ఇంధనాల వల్ల వెలువడే కాలుష్యాల కారణంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. ఇది పర్యావరణానికి ముప్పులాగా మారుతుంది. అందుకే ఇప్పుడు అందరు సోలార్ ఎనర్జీ వైపు చూస్తున్నారు. సంప్రదాయ ఇంధన వనరులైన డీజిల్, పెట్రోల్ ఒక్కపారి అయిపోతే మళ్లీ పునరుత్పత్తి కావు. కానీ సోలార్ ఎనర్జీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది సూర్యడు ఉన్నంతకాలం మనకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా దీనిని ధర పెట్రోల్, డిజీల్, జలవిద్యుత్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు సౌర విద్యుత్ వ్యవస్థను డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read: Life Tax On EV’s: ఎలక్ట్రిక్ వాహనాలకు ఇకపై ఆ పన్ను కట్టాల్సిందే.. మినహాయింపుకు ఇక సెలవు
అయితే ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ ఎనర్జీ సూర్యుడి ఆధారంగా ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి కేవలం సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు అవసరమైన మొత్తంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. అందుకే ఈ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. అయితే సోలార్ ఎనర్జీని స్టోర్ చేసే పరికరాలు ఇంకా ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి రాలేదు.దీని కోసం కావాల్సిన టెక్నాలజీ కూడా సరిగా అందుబాటులో లేదు. ఇక వీటి కోసం సోలార్ ప్యానెల్స్ ఉంచడానికి ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. కేవలం ఇళ్లపై అమర్చే సోలార్ ప్యానెల్స్ తో ఎక్కువ ఎనర్జీని పొందలేము. ఒకవేళ ఇంటిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా కావాల్సి వచ్చినప్పుడు అవసరానికి అనుగుణంగా ఇవి విద్యుత్ ను ఉత్పత్తి చేయలేవు. డొమెస్టిక్ ఉపయోగాలు పక్కన పెడితే పెద్ద పెద్ద కంపెనీలకు సౌరవిద్యుత్ ను అందించాలంటే ఎక్కువ స్థలంలో వీటిని అమర్చాల్సి వస్తుంది. అసలే భూవినియోగం ఎక్కవై పోయి అడవులు అంతరించిపోతున్న ఈ తరుణంలో వీటికి స్థలం కేటాయించడం కోసం అడవులను నరికేస్తే అది వాతావరణంపై ఇంకా ఎక్కువ ప్రభావం కలిగించే అవకాశం ఉంది. ఇక వీటి తయారీకి ఉపయోగించే వస్తువుల లభ్యం కూడా కొంచెం కష్టమే. కొన్ని వస్తువుల బైప్రొడక్ట్ ద్వారా వీటిని తయారుచేస్తారు. అందుకే వీటిని తయారు చేయడం కూడా కొంచెం కష్టమే. అయితే ఈ వస్తువుల వల్ల కూడా పర్యావరణంపై ప్రభావం పడుతుంది.