NTV Telugu Site icon

Sohail Khan: ఉమ్రాన్‌ లాంటి బౌలర్లు మాకు గల్లీకొకరు ఉన్నారు: పాక్ బౌలర్ కామెంట్స్

Pic.jpg1`

Pic.jpg1`

ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం టీమిండియా భవిష్యత్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు. అంతేకాకుండా రెగ్యులర్‌గా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. దీంతో పలువురు మాజీలు కూడా అతడి బౌలింగ్‌కు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే పాక్ మాజీ పేసర్ సోహైల్ ఖాన్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. ఉమ్రాన్ లాంటి పేసర్లు పాక్ దేశవాళీలో బోలెడు మంది దొరుకుతారని కామెంట్ చేశాడు.

Also Read: Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?

“ఉమ్రాన్ మాలిక్ మంచి బౌలరే కాదనను. అతడు ఆడిన 1, 2 మ్యాచ్‌లు చూశాను. అతడు బాగా రన్నింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తున్నాడు. కానీ గంటకు 150 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లను చూడాలంటే నేను 12 నుంచి 15 మంది పేసర్లను చూపిస్తాను. పాకిస్తాన్ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు బోలెడు మంది కనిపిస్తారు. ఒకసారి లాహోర్ ఖలందర్ నిర్వహించే దేశవాళీ మ్యాచ్‌లను వీక్షిస్తే చాలా మంది పేసర్లు కనిపిస్తారు. ఉమ్రాన్ లాంటి బౌలర్లు మా దేశవాళీ క్రికెట్‌లో ఎంతో మంది ఉన్నారు. డొమెస్టిక్ లెవెల్లో రాణించినప్పుడు అతడు తప్పకుండా మంచి బౌలర్ అవుతాడు. షహీన్, నసీమ్ షా, హరీస్ రవూఫ్ లాంటి స్టార్ పేసర్లు ఈ కోవలోకే వస్తారు” అని సోహైల్ ఖాన్ తెలిపాడు.

Also Read: Womens T20 World Cup: విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధం..పూర్తి వివరాలివే

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన అక్తర్(161.3) రికార్డును అతడు అధిగమిస్తాడని అనుకుంటున్నారు. అయితే ఈ అంశంపై స్పందించిన సోహైల్.. అది మనుషుల వల్ల సాధ్యమయ్యే పని కాదని తెలిపాడు. షోయబ్ అందుకోసం ఎంతో శ్రమించాడని అది మరొకరి వల్ల సాధ్యం కాదని అన్నాడు. అతడు రోజులో 32 రౌండ్స్ రన్నింగ్ పూర్తి చేసేవాడని.. తాను వారానికి 20 రౌండ్లు కంప్లీట్ చేయడమే ఎక్కువన్నాడు. అలాంటి నిబద్ధత గల బౌలర్‌ను మరొకరిని చూసే అవకాశం లేదన్నాడు.

Show comments