Site icon NTV Telugu

Sangareddy: భార్యపై అనుమానం.. బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త..

Teen Kills Mother

Teen Kills Mother

Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌లో భార్యను భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కేఎస్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకట బ్రహ్మం అనే వ్యక్తి తన భార్య కృష్ణవేణిని ఈ రోజు ఉదయం బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు.. కృష్ణవేణి కోహీర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకట బ్రహ్మం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇంటర్మీడియట్ చదువుతుండగా, కుమారుడు ఎనిమిదో తరగతి విద్యార్థి.

READ MOPRE: WPL 2026: డబ్ల్యూపీఎల్‌లో ఆడేందుకు ట్రాన్స్‌జెండర్ ప్రయత్నాలు.. ఆర్‌సీబీ కిట్ బ్యాగ్‌తో అనయ!

ఇటీవలి కొన్ని రోజులుగా దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని, కృష్ణవేణికి ఇల్లీగల్ ఎఫైర్ ఉందనే అనుమానంతో బ్రహ్మం తరచూ వాగ్వాదానికి దిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఇద్దిరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపోద్రిక్తుడైన బ్రహ్మం ఇంట్లో ఉన్న బ్యాట్‌తో భార్య కృష్ణవేణిపై దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటన అనంతరం బ్రహ్మం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అమీన్పూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ సంఘటనతో కేఎస్‌ఆర్ కాలనీలో కలకలం సృష్టించింది. కుటుంబ కలహాలు ఇలా ప్రాణాంతక స్థాయికి చేరడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

READ MOPRE: RakulPreetSingh : హాట్ ఫొటోస్ తో రచ్చ లేపుతున్న రకుల్

Exit mobile version