ఆ మహిళకు పెళ్లై మూడేళ్లు అయ్యింది. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన ప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. ఆమె ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఒకటిన్నర సంవత్సరాల పాప కూడా ఉంది. కానీ ఆమె జీవితాన్ని వరకట్న వేధింపులు బలిగొన్నాయి. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులోని సుద్దగుంటెపాళ్యంలో 27 ఏళ్ల మహిళా ఇంజనీర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త, అత్తమామల వరకట్న వేధింపుల కారణంగా తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ తర్వాత, శిల్ప భర్త ప్రవీణ్‌ను అరెస్టు చేశారు.
Also Read:Balapur Ganesh : బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న తెలుగు హీరో..
ప్రవీణ్ కుటుంబం వివాహం సమయంలో రూ. 15 లక్షల నగదు, 150 గ్రాముల బంగారు నగలు, గృహోపకరణాలను డిమాండ్ చేశారని శిల్ప తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ డిమాండ్లను నెరవేర్చినప్పటికీ, వివాహం తర్వాత అదనపు డబ్బు కోసం శిల్ప అత్తమామలు తమపై ఒత్తిడి చేశారని తెలిపారు. వరకట్నం కోసం మానసిక వేధింపుల కారణంగా శిల్ప ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబం ఆరోపించింది.
Also Read:Pro Kabaddi: నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్ Vs తెలుగు టైటాన్స్ మధ్య తొలి పోరు
పెళ్లి సమయంలో, ప్రవీణ్ తనను తాను BE, M.Tech గ్రాడ్యుయేట్ అని చెప్పుకున్నాడు, కానీ గత రెండు సంవత్సరాలుగా అతను పానీ పూరిని అమ్ముతున్నాడు. మా కూతురు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తుందని తెలిపారు. ఇంట్లో ఫ్యాన్ కింద కుర్చీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు హత్యగా అనుమానిస్తున్నారు. తలుపు పగలగొట్టిన ఆనవాళ్లు కూడా కనిపించలేదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శిల్ప తల్లిదండ్రులు తెలిపారు.
