Site icon NTV Telugu

Suicide: 12 రోజుల్లో పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్

Suicide

Suicide

Software Employee Suicide in Hyderababd: హైదరాబాద్‌ గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని కొత్తగూడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విద్యశ్రీ (23) బలవన్మరణానికి పాల్పడింది. 12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొత్తగూడలోని హాస్టల్లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో విద్యశ్రీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తుంది. మార్చి 17న ఆమెకు మ్యారేజ్ ఉంది.. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడింది. కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లాల్సి ఉంది. కానీ సోమవారం హాస్టల్ బాత్ రూంలో షవర్ రాడ్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Read Also: Fake Medicines: బట్టతల రాకుండా జుట్టు పెరిగేందుకు నకిలీ మందుల కలకలం.. ముఠా అరెస్ట్

Exit mobile version