NTV Telugu Site icon

Software Employee Case: ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్.. తమ్ముడి వివాహేతర సంబంధమే కారణం!

Software Employee

Software Employee

Software Employee Case: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో జరిగిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తమ్ముడి వివాహేతర సంబంధం కారణంగానే అన్న హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బ్రాహ్మణపల్లికి చెందిన రిప్పుంజయ, సర్పంచ్ చాణక్య, గోపిలే హత్యకు కారణమని మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారు. వారే తన అన్నను కొట్టి చంపేసి అనంతరం కారులో పెట్టి సజీవదహనం చేశారని మృతుడి తమ్ముడు పురుషుత్తం ఆరోపించాడు. తన విషయం గురించి మాట్లాడాలని వెళ్లిన తన అన్నను దారుణంగా హత్య చేశారని తెలిపాడు.

వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు.. తిరుపతి నుంచి వెళ్తుండగా గంగుడుపల్లె దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిదైంది. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వస్తువులు, కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా మృతుడు నాగరాజుగా గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌ సాయంతో విచారణ కొనసాగుతోంది. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: Atrocious News: దారుణం.. అర్ధరాత్రి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని తగలబెట్టేశారు..

అయితే, నాగరాజును రిప్పుంజయ, సర్పంచ్‌ చాణక్య, గోపీలు హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా పంచాయితీ పేరుతో నాగరాజును సర్పంచ్‌ తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా, నాగరాజు తమ్ముడు పురుషోత్తంకు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్‌ చాణక్య.. నాగరాజుతో మాట్లాడాలని పిలిపించాడు. ఈ క్రమంలోనే మాటల సందర్భంగా ఆగ్రహంతో సర్పంచ్‌ చాణిక్య.. ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సర్పంచ్‌ చాణిక్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరణ వార్త తెలుసుకొని వారంతా బోరునవిలపిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. చాణక్య సోదరుడు రిప్పుంజయ భార్యతో పురుషోత్తంకు వివాహేతర సంబంధం ఉంది. ఇది తెలిసి శివరాత్రి రోజు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం పంచాయితీ పెట్టించినట్లు తెలిసింది. ఈ విషయం గురించి మాట్లాడాలని నాగరాజును పిలిపించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన అన్న మృతికి కారణమైన వారిని దారుణంగా శిక్షించాలని మృతుడి సోదరుడు పురుషోత్తం డిమాండ్ చేస్తున్నారు. తన చిన్నకొడుకు వివాహేతర సంబంధం కారణంగా పెద్ద కొడుకు నాగరాజు ప్రాణాలు కోల్పోయినట్లు మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వారిని విడిచిపెట్టనని ఆయన అన్నారు.

Read Also: Love Fraud: నన్ను మోసం చేశాడు.. నడిరోడ్డుపై ప్రియురాలు రచ్చ మామూలుగా చేయలేదండోయ్‌

ఈ హత్య కేసుపై ఏఎస్పీ వెంకటరావు వివరాలను వెల్లడించారు. ఘటనపై హత్యా నేరంగా కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు ఆధారంగా మృతుడు నాగరాజుగా తేల్చామన్నారు. గ్రామానికి చెందిన చాణక్యప్రసాద్, రిప్పుంజయ, గోపీలు ఈ పని చేశారని మృతుడి తండ్రి తమకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Show comments